
D News: అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా విజువల్స్ ‘అవతార్’ను మించి ఉంటాయంటూ దర్శకుడు శిబి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఓ అభిమాని ‘అవతార్’ వంటి క్లాసిక్ చిత్రాలతో ‘రాకా’ను పోల్చకుండా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనికి శరత్ చంద్ర నాయుడు స్పందిస్తూ.. ‘గ్లోబల్ ట్రయంఫ్’ అనే పదాన్ని ప్రత్యేక కారణంతోనే ఉపయోగించామని, ఆ కారణం త్వరలోనే తెలుస్తుందని తెలిపారు. అలాగే ‘రాకా’ చిత్ర బృందం ఎప్పుడూ ఈ సినిమాను ఇతర గొప్ప చిత్రాలతో పోల్చలేదని స్పష్టం చేశారు. కథ, కంటెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, చివరికి కంటెంటే మాట్లాడుతుందని పేర్కొన్నారు.
భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల మేకర్స్ ‘గ్లోబల్ ట్రయంఫ్’ అంటూ కొత్త ప్రమోషనల్ టీజర్‌ను విడుదల చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ పదం వెనుక ఉన్న అసలు సర్ప్రైజ్ ఏమిటనేది మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
