
D News: మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘తుడక్కమ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రవి బాలచంద్రన్ అనే వీల్‌చైర్‌కు పరిమితమైన విలేజ్ ఆఫీసర్, అతని కూతురు మీను చుట్టూ సాగే ఈ కథలో కుటుంబ బంధాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను మేళవించారు. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కూతురు కనిపించకుండా పోవడంతో..
రవి బాలచంద్రన్ తన భార్యను కోల్పోయిన తర్వాత కూతురు మీనును ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఊరికి దూరంగా ఉండే వారి ఇంటి సమీపంలో జోసెఫ్ మాస్టర్ కుటుంబం మాత్రమే ఉంటుంది. రవి కుటుంబానికి జోసెఫ్ అండగా ఉంటాడు. అయితే ఆస్తి విషయంలో జోసెఫ్‌కు, అతని ఒంటరి తమ్ముడికి తరచూ గొడవలు జరుగుతుంటాయి.
ఇదిలా ఉండగా, ధైర్యసాహసాలు కలిగిన మీను బ్యాంకు పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, ఆమెతో వెళ్లిన స్నేహితురాలు ప్రియ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రవి ఆందోళనకు గురవుతాడు.
అసలు మీనుకు ఏమైంది?
కూతురు ఆచూకీ కోసం రవి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లభించదు. మరోవైపు బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీను ఓ కరడుగట్టిన నేరస్థుడిని ఎదుర్కొంటుంది.
అసలు మీను ఆ నేరస్థుడి బారి నుంచి బయటపడుతుందా? ప్రియ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? జోసెఫ్ కుటుంబంలో జరుగుతున్న గొడవలకు మీను అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? చివరకు రవి కుటుంబానికి ఎదురైన ప్రమాదం ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే.
