
D News: యంగ్ హీరో రాగ్ మయూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రాశి ప్రిన్స్ సెసిల్, అన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా తొలుత సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దీనికి ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 24న నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదల కానుంది.
భారీ క్రేజ్ ఉన్న నాని సినిమాతో పోటీ ఉన్నప్పటికీ ‘అనుమాన పక్షి’ టీమ్ వెనక్కి తగ్గలేదు. “బరిలో కాకి ఉందని పక్షి ఎగరడం ఆపదు” అంటూ కొత్త పోస్టర్ను విడుదల చేసి తమ రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చారు.
‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇలాంటి క్రేజీ మూవీకి ఒక్క రోజు గ్యాప్లో ‘అనుమాన పక్షి’ ఎలాంటి పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
