ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.

కేటీఆర్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన విదేశీ సంస్థకు ఇప్పటివరకు సమన్లు అందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విచారణను కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసిందని పేర్కొన్నారు.

విదేశీ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం రిటర్న్ చేసిందని తెలిపారు. మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేస్తామని, దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని కేటీఆర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

By Rajini