దక్షిణ జోనల్ వ్యవసాయ సదస్సు 2026 తొలి సీజన్ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న హోటల్ ట్రైడెంట్ వేదికగా ఘనంగా నిర్వహించబడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వ్యవసాయ మంత్రులు, విధాన నిర్ణేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు, అగ్రిటెక్ రంగ ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొన్నారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయ పద్ధతులు వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటల ప్రణాళిక నీటి సంరక్షణ సాంకేతికతలు కనీస మద్దతు ధర (MSP) సమర్థవంతమైన అమలు అంతర్రాష్ట్ర వ్యవసాయ వాణిజ్య విధానాలు వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి.
దక్షిణ భారత రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఆధునిక సాంకేతికతలను రైతులకు చేరువ చేయడం వ్యవసాయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం అలాగే రైతు సమాజానికి మెరుగైన మరియు లాభదాయకమైన ఆదాయ అవకాశాలను కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా నిలిచింది. దక్షిణ భారత వ్యవసాయ రంగ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా ఈ సదస్సు నిలిచింది.
