**‘Hanuman Ansh’ Shows No Signs of Slowing Down in Week 6.. ‘Dhurandhar’ Record Broken!**

D News: సాధారణంగా సినిమా ఆరో వారంలోకి వచ్చేసరికి థియేటర్లలో షోలు, కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ ‘హనుమాన్ అన్ష్’ మాత్రం అందుకు భిన్నంగా దూసుకెళ్తోంది. నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన ఈ డివోషనల్ బయోగ్రాఫికల్ డ్రామా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

ఐదురోజుల్లోనే రూ.64.87 కోట్లు

గతంలో ‘ధురంధర్’ ఆరో వారంలో రూ.28.95 కోట్ల నెట్ వసూళ్లతో రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ‘హనుమాన్ అన్ష్’ ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించింది. ఆరో వారం కేవలం ఐదు రోజుల్లోనే రూ.64.87 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు తాజా బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.

సోమవారం రూ.8 కోట్లు, మంగళవారం రూ.7.80 కోట్లు వసూలు చేయడం విశేషం. వీక్‌డేస్‌లోనూ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా కలెక్షన్లపై ఆసక్తి నెలకొంది.

రూ.218 కోట్లకు చేరిన నెట్ కలెక్షన్స్

తాజా వసూళ్లతో కలిపి దేశవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.218.03 కోట్ల నెట్ సాధించినట్లు సమాచారం. ఆధ్యాత్మిక అంశాలతో పాటు భావోద్వేగ కథనం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతోనే లాంగ్ రన్‌లోనూ కలెక్షన్లు బలంగా కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఆరో వారం పూర్తయ్యేలోపే ఈ స్థాయి వసూళ్లు సాధించిన ‘హనుమాన్ అన్ష్’.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana