
D News: ‘బలగం’తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం **‘ఎల్లమ్మ’**పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు, శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్గా అనంతిక పేరు?
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో సాయిపల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత్ వంటి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’, ‘రొమాంచకం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను హీరోయిన్గా దాదాపు ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన?
ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ షూటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. అనంతిక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్గా ఆమె ఎంపికపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
