
D Spiritual: Sept 15: వినాయక నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు సమీపంలో ఎక్కడ అన్నదానం జరుగుతోంది? ఏ సమయంలో ప్రసాదం అందిస్తున్నారు? అనే వివరాలను తెలుసుకోవాలనుకునే వారికి ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది.
‘Annadhanam Spots’ పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా సమీపంలోని అన్నదానం కేంద్రాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అన్నదానం జరిగే ప్రదేశం, ప్రసాదం అందించే సమయం తదితర సమాచారాన్ని ఈ వెబ్సైట్లో ఉచితంగా పొందే అవకాశం ఉంది.
