
D News: హీరో సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రామ్ చరణ్‌తోనే ఆ కథ
తన డ్రీమ్ హీరో రామ్ చరణ్ అని చెప్పిన సంతోష్ జాగర్లపూడి.. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. అంతేకాదు, ఇప్పటికే కథతో పాటు ‘మెగాస్టార్’ అనే టైటిల్, పోస్టర్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ సినిమా చిరంజీవి బయోపిక్ కాదని స్పష్టం చేసిన దర్శకుడు.. 1980లో మెగాస్టార్ ఎలా ఉండేవారనే కాన్సెప్ట్‌తో రామ్ చరణ్‌ను చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘ధురంధర్’ తరహా జోనర్‌లో ఈ కథను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
‘వారాహి’తో నెక్ట్స్ స్టెప్
ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ తన కెరీర్‌కు కీలకమైన సినిమాగా నిలుస్తుందని సంతోష్ జాగర్లపూడి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా సక్సెస్ అయితే రామ్ చరణ్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశం మరింత బలపడనుంది.
