
D News: మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రావడం లేదు. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. వరుస వాయిదాలతో సినిమా థియేటర్లలోకి రావడం ఆలస్యమవుతోంది. తాజాగా ఓటీటీ డీల్ కూడా ఇంకా కుదరలేదనే వార్తలు రావడంతో రిలీజ్‌పై మళ్లీ సందిగ్ధత నెలకొంది.
వరుసగా వాయిదాలు
భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ‘విశ్వంభర’ ఆలస్యమవుతూ వచ్చింది. 2026 సమ్మర్లో వస్తుందని గతంలో ప్రచారం జరిగినా అది కూడా జరగలేదు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ‘కాకా’ సినిమాతో బిజీగా ఉండగా, దర్శకుడు వశిష్ఠ కూడా మరో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
OTT డీల్ కుదిరితేనేనా?
నిర్మాతలు ఆశిస్తున్న మొత్తానికి, ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉండటంతో డీల్ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఈ డీల్ పూర్తయిన తర్వాతే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సినిమా ఆగిపోయిందన్న ప్రచారానికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి.
