
D Educt: Sept 10: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. 16 వరకు దరఖాస్తులు
ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2026 ప్రవేశ పరీక్షకు హాజరైన అర్హులైన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
16వ తేదీ రాత్రి 7 గంటల వరకు అవకాశం
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను పూర్తిచేసి ఈ నెల 16వ తేదీ రాత్రి 7 గంటల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు పేర్కొన్నారు.
విద్యార్హతలు ఇవే..
అభ్యర్థుల కనీస వయసు ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఓసీ విద్యార్థులు సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులు సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
సందేహాలుంటే ఈ నంబర్లకు సంప్రదించాలి
బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించిన మార్గనిర్దేశాలు, ఇతర వివరాల కోసం 8978780501, 7997710168 నంబర్లను సంప్రదించాలని విశ్వవిద్యాలయం సూచించింది. దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9000780707, 8008250842 నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొంది.
