
D News: తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నాడు. వరుస ప్రయోగాలతో ఎదురైన చేదు ఫలితాల తర్వాత తన కథల ఎంపికలో మార్పు తీసుకొచ్చిన సూర్య.. ఇప్పుడు కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ఈ ఫార్ములా వర్కౌట్ కావడంతో ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు.
ఈ రెండు సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. సూర్య 47గా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్, విడుదల తేదీ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో సూర్య విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ‘ఆవేశం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో రెండు హిట్స్ అందుకున్న సూర్య.. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే ఒకే ఏడాదిలో మూడు హిట్స్ అందుకున్న హీరోగా ప్రత్యేక రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ అందుకుంటే మరో అరుదైన రికార్డు కూడా సూర్య ఖాతాలో చేరనుంది.
అంతేకాదు.. తమిళ, తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన దర్శకులతో వరుసగా సినిమాలు చేసి ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ విజయాలు అందుకుంటే సూర్య కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన ఘనతగా నిలిచే అవకాశం ఉంది. ఈ రికార్డులన్నింటికీ సూర్య ఎంతవరకు దగ్గరవుతాడో దీపావళికి తేలనుంది.
