
D News: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే మాటల యుద్ధాలు, గొడవలు మొదలవుతాయి. అయితే బిగ్‌బాస్ 10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఆటో రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. తనను నామినేట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని తోటి కంటెస్టెంట్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.
“రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి” అంటూ రాంప్రసాద్ హెచ్చరించాడు.
అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు ఒకసారి పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని కూడా సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట సరైనది కాదని చెప్పే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాంప్రసాద్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడు? అసలు నామినేషన్స్‌లో ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి ఇప్పుడు మొదలైంది. ఇప్పటికే టాస్కులు, గ్రూపుల మధ్య విభేదాలతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. దీనికి రాంప్రసాద్ వార్నింగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది.
నామినేషన్స్‌లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానన్న రాంప్రసాద్ వ్యాఖ్యలతో.. రాబోయే బిగ్‌బాస్ 10 ఎపిసోడ్లో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
