
D News: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ RC17పై కీలక అప్డేట్ వినిపిస్తోంది. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ RC17 స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్‌కు ఫైనల్ నెరేషన్ ఇవ్వాల్సి ఉందని సమాచారం. చరణ్ నెరేషన్‌కు ఓకే చెప్పిన తర్వాత రెగ్యులర్ షూటింగ్‌తో పాటు మిగతా నటీనటుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించి, నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుండటంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని టాక్.దీంతో 2027లో కాకుండా 2028లో RC17 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రిలీజ్ విషయంలో మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
త్వరలోనే RC17 నటీనటులు, షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సుకుమార్–రామ్ చరణ్ ‘రంగస్థలం’ మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
