
D News: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త సినిమాకు టైటిల్‌ను ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఇంజి వెల్లం’ (Inji Vellam) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మలయాళంలో ‘ఇంజి వెల్లం’ అంటే తెలుగులో ‘అల్లం నీరు’ అని అర్థం.
టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదలైన ప్రచార చిత్రంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మణిరత్నం మార్క్‌కు తగ్గట్టుగా ఈ మూవీని వైవిధ్యమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచార చిత్రాన్ని బట్టి కోల్‌కతా నేపథ్యం కథలో కీలకంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు.
విజయ్ సేతుపతి, సాయిపల్లవి తొలిసారి మణిరత్నం దర్శకత్వంలో కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం–ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
