
D News: స్టార్ హీరో సూర్య నటించిన సక్సెస్ఫుల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించారు.
ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. సూర్య, మమితా బైజు నటనతో పాటు వెంకీ అట్లూరి టేకింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు పేర్కొన్నారు. చిత్రబృందం ప్రకారం.. మూవీ ఇప్పటివరకు రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 11 నుంచి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కథేంటి?
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఓ సంపన్న కుటుంబానికి చెందిన వారసుడు. 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడంతో అతని తల్లి (రాధికా శరత్‌కుమార్) వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంటుంది.దీంతో అమెరికా వెళ్లిన సంజయ్.. సరోగసీ ద్వారా ఓ బిడ్డను పొందుతాడు. అయితే ఆ చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో అతడికి కన్నతల్లి అవసరమవుతుంది.దాంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని వెతుక్కుంటూ సంజయ్ మరోసారి అమెరికా వెళ్తాడు. అక్కడ అతని జీవితంలో మదన కామేశ్వరి అలియాస్ మ్యాడీ (మమితా బైజు) ఎలా ప్రవేశించింది? చివరికి తన బిడ్డ తల్లిని సంజయ్ కనిపెట్టాడా? అనేది సినిమాలో చూడాల్సిందే.
