
D Educt: Sept 4: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) లోయర్ గ్రేడ్ పరీక్షల ఫలితాలను సెప్టెంబరు 3న విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమళ్ల లింగయ్య తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ వెబ్ మెమోలను కూడా అదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
సెప్టెంబరు 21 నుంచి డీఈడీ పరీక్షలు
డీఈడీ రెండో సంవత్సరం పరీక్షలను సెప్టెంబరు 21 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య తెలిపారు. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు.
