
రాష్ట్ర గవర్నర్ సి. శివ్ ప్రతాప్ శుక్లా సోమవారం ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్లో నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ ఉన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ వద్ద గవర్నర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గవర్నర్ కాన్వాయ్‌లో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు గవర్నర్‌కు గౌరవ వందనం సమర్పించారు.

