22ఏ నిషేధిత జాబితాలో తమ ఆస్తులు చేర్చడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తెలంగాణ భవన్లో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా 22ఏ జాబితాలో ఇళ్ల స్థలాలు, భూములు చేరడంతో ఎదురవుతున్న సమస్యలను బాధితులు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇళ్లు, భూములు 22ఏ జాబితాలో చేర్చడంతో వాటిని విక్రయించలేకపోవడంతోపాటు బ్యాంకు రుణాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు హరీశ్‌రావుకు వివరిస్తున్నారు.
నిజమైన ప్రైవేటు ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు.

