
D Educt: Aug 24: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెప్టెంబర్ 2026లో నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను త్వరలో విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.
సెప్టెంబర్ 6న రెండు షిఫ్టుల్లో CTET పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయి ఎగ్జామ్ సిటీ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ముందుగా విడుదల చేస్తున్నట్లు CBSE తెలిపింది. ఈ స్లిప్‌లో పరీక్ష నిర్వహించే నగరానికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి.
ఇక పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష సమయం, ఇతర ముఖ్యమైన మార్గదర్శకాలతో కూడిన అడ్మిట్ కార్డులను తదుపరి దశలో విడుదల చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు తాజా సమాచారం కోసం CTET అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించింది.
