D Educt: Aug 24: దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్టు 30న జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఆగస్టు 24న విడుదల చేయనుంది.

అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే ముందు హాల్‌టికెట్‌లో ఉన్న వివరాలను అభ్యర్థులు ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు.

పరీక్ష రోజున ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అలాగే చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.

అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన తాజా వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని NBEMS సూచించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana