
D Educt: Aug 22: ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ల కేటాయింపును అధికారులు ఆగస్టు 21న పూర్తి చేశారు. ఈ విడతలో కొత్తగా 11,729 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 38,462 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్ కలుపుకుని ఇప్పటివరకు 23,988 సీట్లు (62 శాతం) భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు.
ఎంబీఏలో మొత్తం 31,181 సీట్లకు గాను 20,889 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ఎంసీఏలో 7,281 సీట్లకు గాను 3,099 సీట్లు మాత్రమే నిండాయి. దీంతో రెండు కోర్సుల్లో కలిపి ఇంకా 14,474 సీట్లు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
చివరి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 24లోపు ఫీజు చెల్లించి, ఆగస్టు 25లోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.
