D news20; సోషల్ మీడియాలో “అద్దెకు బాయ్‌ఫ్రెండ్” (Rent-a-Boyfriend) అంటూ వైరల్ అవుతున్న ప్రకటనలు ఒక సైబర్ మోసం కావచ్చని అధికారులు హెచ్చరించారు. కాఫీ డేట్‌కు రూ. 499, సినిమాకు రూ. 1,250 అంటూ వస్తున్న ఈ ఆకర్షణీయమైన యాడ్స్ చూసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్లలో కాఫీ మీటింగ్‌కు రూ. 499, సినిమా డేట్‌కు రూ. 1,249గా రేట్లు ప్రకటించారు.
షాపింగ్ వెళ్లేందుకు రూ. 1,499, పెళ్లిళ్లు లేదా ఈవెంట్లకు తోడుగా ఉండేందుకు రూ. 1,999గా చూపించారు.
రోజంతా ఉండేందుకు ఫుల్ డే ప్యాకేజీ కింద రూ. 4,499 ధరలు నిర్ణయించినట్లు పోస్టర్లలో ఉంది.

పోలీసుల హెచ్చరికలు

ఏఐ (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫోటోలు, ఇంటర్నెట్ చిత్రాలను వాడి ఈ ఫేక్ యాడ్స్ తయారు చేశారు.
యువతను, ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్ చేసి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ఈ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ రకమైన మోసపూరిత లింక్స్ లేదా ప్రకటనలను నమ్మి వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు

By CS.H