
D Educt: Aug 20: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆగస్టు 19న ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించిన సాధారణ ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 15తో ముగిసింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న సొసైటీ.. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది.
అర్హత ఉన్న విద్యార్థులు ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను సంప్రదించి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ సూచించింది. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అర్హులైన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
