D Educt: Aug 17: UGC NET జూన్ 2026 పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు నిర్వహించిన పరీక్షలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మూడు పేపర్లలో పలు లోపాలు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA వెల్లడించింది.

UGC NET జూన్ 2026 పరీక్షలను NTA జూన్ 22 నుంచి 30 వరకు నిర్వహించింది. అనంతరం జూలై 5న రీ-టెస్ట్ నిర్వహించింది. మొత్తం 87 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా.. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో పలు తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో లోపాలను పరిశీలించేందుకు NTA ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రశ్నపత్రాల్లో పలు లోపాలు

ప్రత్యేక కమిటీ సమగ్రంగా పరిశీలించిన అనంతరం మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో పలు రకాల లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రముఖ పండితుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, పుస్తకాల పేర్లలో పొరపాట్లు, ప్రశ్నల పదబంధాల్లో తప్పులు, వ్యాకరణ దోషాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది.

అలాగే లింగం, వచన అన్వయంలో పొరపాట్లు, విరామ చిహ్నాల తప్పులు, ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న భావాలకు ప్రామాణికం కాని పదాలను ఉపయోగించడం వంటి లోపాలు కూడా ఉన్నట్లు తెలిపింది. గతంలో అడిగిన ప్రశ్నల్లో గణనీయమైన సంఖ్యలో ప్రశ్నలను మళ్లీ ఇవ్వడం కూడా గుర్తించిన లోపాల్లో ఒకటిగా పేర్కొంది.

అభ్యర్థులందరికీ న్యాయమైన, లోపాలు లేని పరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించిన కమిటీ.. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ మూడు పేపర్లను తిరిగి నిర్వహించాలని సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా NTA రీ-కండక్ట్‌కు నిర్ణయం తీసుకుంది.

UGC NET రీ-కండక్ట్ పరీక్షల తేదీలు

NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లిష్ పరీక్ష సెప్టెంబర్ 9, 2026న మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ పరీక్ష జరుగుతుంది.

సోషియాలజీ పరీక్షను సెప్టెంబర్ 10, 2026న మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

అదనపు ఫీజు అవసరం లేదు

ఈ మూడు సబ్జెక్టులకు చెందిన అభ్యర్థుల నుంచి రీ-కండక్ట్ పరీక్ష కోసం ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు వసూలు చేయబోమని NTA స్పష్టం చేసింది. పరీక్ష నగరం, పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను తదుపరి దశలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపింది.

మరోవైపు 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను NTA విడుదల చేసింది. ఈ 84 సబ్జెక్టులకు సంబంధించిన UGC NET 2026 ఫలితాలను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రకటిస్తామని తెలిపింది.

ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు రీ-కండక్ట్ పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ.. మిగిలిన 84 సబ్జెక్టులకు సంబంధించిన JRF సీట్ల కేటాయింపు, ఈ-సర్టిఫికెట్ల జారీ ఆలస్యం కాదని NTA స్పష్టం చేసింది. రీ-కండక్ట్ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం, పరీక్ష కేంద్రం, సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డు తదితర వివరాల కోసం అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana