80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజా సభలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, సమర్థత, సౌకర్యం కల్పించేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుండగా, కోటికి పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి, అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆహార భద్రతను బలోపేతం చేయడం, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ ప్రయోజనాలు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

By Rajini