80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ పర్యవేక్షించి 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెరెడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వివిధ శకటాలను ఆసక్తిగా తిలకించడం జరిగింది

స్వతంత్ర సమరయోధులను గౌరవించి సత్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించడం జరిగింది మెప్మా ఆధ్వర్యంలో 64 మహిళా సంఘాలకు 9 కోట్ల 25 లక్షల రూపాయల చెక్కును అందించి, 821 shg లకు 78 కోట్ల రూపాయల చెక్కును అందించి, జిలాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి అవకాశాలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
జాతీయ సమగ్రత, సోదరభావం, సామాజిక ఐక్యతను కాపాడుకుంటూ, సమానత్వంతో ముందుకు సాగుతున్న భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది, సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యాలుగా మనమందరం ఐక్యంగా ముందుకు సాగుదాం. 🇮🇳
