ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా హాజరయ్యారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. పాటలు, నృత్యాల ద్వారా విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా హనుమంతరావు విద్యార్థులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ బంజారా వేషధారణలో ఎంతో ఉత్సాహంగా, సులభంగా మరియు హావభావాలతో ఆకట్టుకునేలా నృత్య ప్రదర్శన చేశారు.

By Rajini