
D Educt: Aug 13: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించిన 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జులై 28న నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 2,75,287 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 53.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా తదుపరి ఉన్నత విద్యలో చేరేందుకు మార్గం సుగమమైంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ తదుపరి విద్యకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు.
విద్యార్థులు తమ ఫలితాలను CBSE అధికారిక వెబ్సైట్లైన cbse.gov.in, http://cbseresults.nic.in/లో పరిశీలించుకోవచ్చు. వీటితో పాటు DigiLocker, UMANG యాప్‌లలో కూడా మార్కుల మెమోలు అందుబాటులో ఉంచారు.
విద్యార్థులు తమ రోల్ నంబర్, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డు ఐడీ వంటి వివరాలను ఉపయోగించి లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను పరిశీలించడంతో పాటు అవసరమైతే మార్కుల మెమోను ప్రింట్ తీసుకోవచ్చు.
