D Educt: Aug 12: దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల (జీసీపీఈ)లో ఏడాది పాటు ఫారెన్ సర్వీస్ కింద పనిచేసేందుకు ఇన్‌సర్వీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు. మొత్తం 22 మందిని ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఆగస్టు 17 నుంచి 27వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు ముఖాముఖి, తరగతి గదిలో బోధన, క్రీడల ప్రదర్శన వంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా ఎంఫెడ్‌ ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఎంఫిల్, పీహెచ్‌డీ, నెట్, స్లెట్‌ వంటి అదనపు అర్హతలు ఉన్న అభ్యర్థులకు వెయిటేజీ కల్పించనున్నారు. ముఖాముఖి కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను పిలవనున్నట్లు నవీన్ నికోలస్ వివరించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana