
హైదరాబాద్ నగరంలో మరో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. నగరంలో ‘ట్రంప్ టవర్స్’ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో రెండు ట్విన్ టవర్లను నిర్మించనున్నారు.
ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌లో దాదాపు 450 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 240 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న ఈ టవర్లలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నారు.
స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, ప్రైవేట్ వ్యూయింగ్ డెక్స్, స్కై డుప్లెక్స్‌లు, ప్రత్యేక స్కై బ్రిడ్జ్ వంటి విలాసవంతమైన సదుపాయాలు ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక ధరల విషయానికి వస్తే.. ఒక్కో ఫ్లాట్ ధర సుమారు రూ.5 కోట్ల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌస్‌ల ధరలు ఏకంగా రూ.62 కోట్ల వరకు ఉండనున్నాయి. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్న కోకాపేటలో ‘ట్రంప్ టవర్స్’ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
గోల్డెన్ మైల్ రోడ్డులో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో రెండు అత్యాధునిక ట్విన్ టవర్లను నిర్మించనున్నారు. అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, హైదరాబాద్‌కు చెందిన ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాయి.
కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త చర్చకు తెరతీస్తోంది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ట్విన్ టవర్లు నగర స్కైలైన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
