
తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్లిన కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా కేసీఆర్ స్వయంగా చెక్కులపై సంతకాలు చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు కుమార్తెకు చెరో రూ.కోటి చొప్పున ఆయన తల్లిదండ్రులకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు.
కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ కోసం కీలకంగా పనిచేశారు. వరంగల్ జిల్లాలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహిత అనుచరుడిగా కొనసాగారు. ఆయన మృతితో కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో స్వయంగా నల్లబెల్లికి వెళ్లి పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
