D News: Aug 11 పీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఈ ర్యాలీలో ప్రదర్శించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటోతో పాటు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో కూడా కొన్ని ఫ్లెక్సీల్లో కనిపించింది. ఏపీకి సంబంధించిన రాజకీయ నిరసన కార్యక్రమంలో పక్క రాష్ట్రానికి చెందిన కేటీఆర్ ఫొటో ప్రత్యక్షం కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

“రాసి పెట్టుకోండి.. 2029లో అధికారంలోకి వచ్చేది మేమే” అనే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలను పట్టుకుని ర్యాలీలో పాల్గొనడంతో కార్యక్రమం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీ రాజకీయ కార్యక్రమంలో జగన్‌తో పాటు కేటీఆర్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలు కనిపించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2029లో అధికారంలోకి వస్తామంటూ వైసీపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ ఫొటో వినియోగం ఇప్పుడు రాజకీయ చర్చకు

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana