
D-News: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పండగ సీజన్లో పసిడి ధరలు ఇప్పటికే కొనుగోలుదారులకు షాక్ ఇస్తుండగా.. తాజాగా మరింత పైకి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో నేడు బంగారం ధరలు గణనీయంగా లాభపడ్డాయి. సోమవారం ముగింపు ధరతో పోలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,160 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,900, 18 క్యారెట్ల బంగారం ధర రూ.2,370 మేర పెరిగింది.
మొత్తంగా బంగారం ధర 1.22 శాతం పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.1,55,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా ఇదే బాటలో భారీగా లాభపడింది. కిలో వెండి ఫ్యూచర్స్ ధర 1.05 శాతం పెరిగి రూ.2,40,340 వద్ద కొనసాగుతోంది.
వివిధ నగరాల్లో గ్రాము బంగారం ధరలు
నేడు వివిధ నగరాల్లో గ్రాము బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
- చెన్నై: 24 క్యారెట్లు – రూ.15,546 | 22 క్యారెట్లు – రూ.14,250 | 18 క్యారెట్లు – రూ.12,000
- ముంబై: 24 క్యారెట్లు – రూ.15,513 | 22 క్యారెట్లు – రూ.14,220 | 18 క్యారెట్లు – రూ.11,635
- బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.15,513 | 22 క్యారెట్లు – రూ.14,220 | 18 క్యారెట్లు – రూ.11,635
- హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ.15,513 | 22 క్యారెట్లు – రూ.14,220 | 18 క్యారెట్లు – రూ.11,635
- విజయవాడ: 24 క్యారెట్లు – రూ.15,513 | 22 క్యారెట్లు – రూ.14,220 | 18 క్యారెట్లు – రూ.11,635
- విశాఖపట్నం: 24 క్యారెట్లు – రూ.15,513 | 22 క్యారెట్లు – రూ.14,220 | 18 క్యారెట్లు – రూ.11,635
అంతర్జాతీయంగా నెలకొంటున్న ఉద్రిక్తతలు, మార్కెట్లో పెట్టుబడిదారుల కదలికలు, డాలర్ విలువ వంటి పలు అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల నగల కొనుగోలుదారులు తాజా మార్కెట్ రేట్లను పరిశీలించిన తర్వాత కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.
