
లివింగ్ రూమ్‌లో లిల్లీ పువ్వులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రేమ, సామరస్యం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. అలాగే పూజ గది దగ్గర లిల్లీ పువ్వులను ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు
లిల్లీ మొక్కను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఎక్కడ పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి? లిల్లీ పువ్వులకు సంబంధించిన వాస్తు నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో పువ్వులు అందాన్ని పెంచడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పువ్వులు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయని నమ్ముతారు. వాటిలో లిల్లీ పువ్వులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
లిల్లీ పువ్వులను ఇంట్లో ఉంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. అయితే ఈ పువ్వులను సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచడం ముఖ్యమని సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం.. తెల్ల లిల్లీ పువ్వులను గాజు పూల కుండీలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో ప్రశాంతత, సానుకూలతను పెంచుతుందని నమ్మకం. అలాగే గులాబీ రంగు లిల్లీ పువ్వులను ఇంట్లో ఉంచడం వల్ల శుక్ర గ్రహానికి సంబంధించిన అనుకూల ఫలితాలు లభిస్తాయని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి.
వాస్తు ప్రకారం.. లిల్లీ మొక్కను లేదా పువ్వులను ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం మంచిదిగా భావిస్తారు. ఈ దిశల్లో ఉంచడం వల్ల ఇంట్లో మంచి శక్తి పెరుగుతుందని, కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం, ప్రశాంతత నెలకొంటుందని నమ్ముతారు.
