వాట్సప్‌లో త్వరలో మరో ఫీచర్ కనిపించనుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ. వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ తప్పనిసరి కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను వాట్సప్ భారత్‌లో పరీక్షిస్తోంది. పలు వినియోగదారులను పుట్టిన తేదీ నమోదు చేయమని కోరుతోంది.

వాట్సప్ యూజర్ల పుట్టిన తేదీని నమోదు చేయమని కోరుతోంది. ఈ మేరకు వాట్సప్‌లో ఒక ప్రాంప్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతం డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయడం ఆప్షనల్ అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో భారత చట్టాల ప్రకారం తప్పనిసరి కావొచ్చని వాట్సప్ తెలిపింది. ప్రస్తుతానికి డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ తప్పనిసరి కాకపోవంతో వాట్సప్ యాక్సెస్ చేయడంపై ఎలాంటి ప్రభావం చూపదు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం కింద పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించే ఫ్లాట్‌ఫామ్‌పై నిబంధనలు అమలు చేసేందుకు భారత్ సిద్దమైంది.

ఈ క్రమంలో వాట్సప్‌లో ఈ టెస్టింగ్ జరగడం చర్చనీయాశంగా మారింది. రాబోయే రోజుల్లో పుట్టిన తేదీ నమోదు చేయడం తప్పనిసరి కావొచ్చు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టానికి అనుగుణంగా వినియోగదారులు తమ వయస్సును ధృవీకరించుకునేందుకు సహాయపడేందుకు ఈ టెస్టింగ్ ని ర్వహిస్తున్నట్లు వాట్సప్ ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం ఫంక్షనాలిటీని పరీక్షిస్తున్నామని, వాట్సాప్‌ను ఉపయోగించడం కొనసాగించడానికి వినియోగదారుల వయస్సు అడగడం లేదని స్పష్టం చేసింది.

వినియోగదారుల వయస్సు డేటాను ఇతర వినియోగదారులతో పంచుకోమని కోరడం లేదని వాట్సప్ ప్రతినిధులు చెప్పారు. చిన్నపిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే ముందు వినియోగదారులు 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారా కాదా అనేది తనిఖీ చేసుకునేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వాట్సప్ చెప్పుకొచ్చింది. భారత్‌లో సోషల్ మీడియాపై నియంత్రణ పెరుగుతోంది. అందులో భాగంగా వయస్సు నిర్ధారణ పరీక్ష వాట్సప్ నిర్వహించింది.

దేశంలో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాయి. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించాయి. ఇక మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాతో పాటు కొన్ని దేశాలు చిన్నపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.




By Hemanth

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana