D Entr: Jul 25: నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన చిత్రబృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది.

వైద్యుల పరీక్షల్లో బాలకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స అవసరమని తేలింది. శస్త్రచికిత్స అనంతరం కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.

ఈ నేపథ్యంలో బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రహ్మాణి తన తండ్రి ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్త అందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్టులో, “నాన్న సర్జరీ విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన తన పాత ఉత్సాహాన్ని తిరిగి పొందుతున్నారు. త్వరలోనే మళ్లీ పనుల్లోకి వస్తారు. ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం” అని పేర్కొన్నారు.

బ్రహ్మాణి పోస్ట్‌తో బాలయ్య శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే కోలుకుంటున్నట్లు సమాచారం. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో బాలకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత, తన కొత్త సినిమా షూటింగ్‌లో మళ్లీ పాల్గొననున్నట్లు సమాచారం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana