
D Entr: Jul 16: బిగ్ బాస్ తెలుగు 10: బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి వెళ్లను.. జబర్దస్త్ యోధ కామెంట్స్ వైరల్
బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. విమర్శలు ఎదురైనా ప్రతి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. ఈ షోలో పాల్గొనేందుకు సినీ, టెలివిజన్ సెలబ్రిటీలు ఆసక్తి చూపుతుండగా, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సందడి ప్రారంభమైంది. ఇప్పటికే నిర్వాహకులు ప్రోమోలు విడుదల చేయడంతో పాటు “అగ్నిపరీక్ష” పేరుతో సామాన్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది.
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యులతో పాటు సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్లు కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో జబర్దస్త్ నటి యోధ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యోధ సిస్టర్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యోధ ప్రస్తుతం జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తండ్రితో కలిసి పాల్గొన్న ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తనకు బిగ్ బాస్ అంటే ఎంతో ఇష్టమని, ఆ షోను క్రమం తప్పకుండా చూస్తానని చెప్పింది.
యోధ తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తె బిగ్ బాస్‌కు పెద్ద అభిమాని అని తెలిపారు. “డాడీ… మీరు బిగ్ బాస్‌కు వెళ్లండి” అని తరచూ తనను ప్రోత్సహించేదని, చివరికి ఒక్కటి లేదా రెండు రోజులైనా హౌస్‌లో ఉండేలా ప్రయత్నించాలని కూడా కోరిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయితే ఇంటర్వ్యూలో యాంకర్ యోధను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని సూచించగా, ఆమె మాత్రం స్పష్టంగా నిరాకరించింది. “నేను వెళ్లను” అని తేల్చి చెప్పిన యోధ, దీప్తి సునయన వంటి వారు చిన్న వయసులోనే బిగ్ బాస్‌లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించినా తన నిర్ణయం మారదని వెల్లడించింది. “ఆఫ్టర్ టెన్త్ స్టాండర్డ్ తర్వాత… ఆహా, లేదు లేదు… నేనస్సలు వెళ్లను” అంటూ సరదాగా స్పందించిన యోధ, బిగ్ బాస్ షో అంటే ఎంతో ఇష్టమే అయినప్పటికీ, అందులో పాల్గొనే ఆసక్తి మాత్రం తనకు లేదని స్పష్టం చేసింది.
