D News: Jul 9: మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 178 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అశ్వారావుపేట, బూర్గంపాడు, చంద్రుగొండ, చర్ల, దమ్మపేట, దుమ్ముగూడెం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే పదో తరగతి ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు పరిధిలో నివసించే మహిళలు మాత్రమే అర్హులు.

అర్హత కలిగిన అభ్యర్థులు జులై 18, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడుతుంది. ఇంటర్ మార్కులకు 70 శాతం వెయిటేజీతో పాటు వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు అదనపు వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జులై 20 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించనున్నారు.

దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇంటర్ మార్కుల మెమో, నివాస ధ్రువీకరణ పత్రంతో పాటు అవసరమైతే సదరం సర్టిఫికేట్, భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా అనాథ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana