D News: July 7: తెలంగాణ వాతావరణ సమాచారం: తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతుండగా, రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు తాజా వాతావరణ బులెటిన్‌ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జూలై 7 నాటికి నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని మిగిలిన ప్రాంతాలు, రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించాయి. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం బలహీనపడి, తూర్పు మధ్యప్రదేశ్‌పై స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉందని అధికారులు వివరించారు. శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొనే అవకాశం ఉండగా, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప జిల్లాల్లో మధ్యస్థ స్థాయిలో వర్షాల కొరత ఉండొచ్చని తెలిపారు. అలాగే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా మధ్యస్థ వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశముందని వెల్లడించారు. కరువు ప్రభావిత మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana