DNews: 23 Sep: పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రౌఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్ (Mujna Masood Malik) తన సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) పోస్ట్‌లలో చేసిన వ్యాఖ్యలు భారతీయ మరియు పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి. సెప్టెంబర్ 22, 2025న (ఆదివారం) జరిగిన T20 ఆసియ కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్తాన్ ని భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత, ముజ్నా ఒక ముజ్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో “మ్యాచ్ ఓడాం కానీ యుద్ధం గెలిచాము” (We lost the match but we won the war) అని రాసింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి, మరియు భారతీయ అభిమానులు, మీడియా దీనిని “అసాధారణం” మరియు “రెచ్చగొట్టేది” అని విమర్శించారు. ముజ్నా పోస్ట్‌ను తొలగించి, క్షమాపణ చెప్పింది, కానీ వివాదం కొనసాగుతోంది.

ముజ్నా మసూద్ మాలిక్ ఎవరు?

ముజ్నా, 28 ఏళ్ల పాకిస్తాన్ మోడల్ మరియు ఇన్‌ఫ్లూయెన్సర్. హారిస్ రౌఫ్‌తో 2023 డిసెంబర్ 28న మర్రేజ్ చేసుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 500K+ ఫాలోవర్లు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ పోస్ట్‌లు పాస్ట్ చేస్తుంది. ముజ్నా మాజీ క్రికెటర్ మసూద్ అహ్మద్ మాలిక్ కుమార్తె, మరియు హారిస్‌తో “లవ్ మ్యారేజ్” చేసుకున్నారు. ఆమె ముంబైలో జన్మించి, పాక్‌కు మారారు.

హారిస్ రవూఫ్ వివాస్పద సంజ్ఞలు

మైదానం బౌండరీ లైన్ వద్ద ఉన్న భారత అభిమానులను ఉద్దేశించి రౌఫ్ “6-0” హావభావం చూపాడు. ఇది పాకిస్థాన్‌ వర్గాలు చెబుతున్న ఆపరేషన్ సిందూర్లో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామన్న నిర్ధారణలేని దావాకు సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, విమానం కూలుతున్నట్లు నటిస్తూ ఆయన చూపించిన హావభావం ఆన్‌లైన్‌లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

ఇది అంతా భారత అభిమానులు “కోహ్లీ… కోహ్లీ…” అంటూ నినాదాలు చేసిన నేపథ్యంలో జరిగింది. 2022 టి20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్సర్లు గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆ నినాదాలు చేశారు.

మైదానంలోనూ ఘర్షణలు

మైదానంలో కూడా రౌఫ్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో ఓవర్‌లో అభిషేక్ శర్మతో వాగ్వాదం జరిపాడు. తరువాత శుభ్‌మన్ గిల్‌తో కూడా ఘర్షణకు దిగాడు.

భార్య మద్దతు – సోషల్ మీడియాలో కలకలం

ఈ వివాదాస్పద ప్రవర్తనకు రౌఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్ మద్దతుగా నిలిచారు. వృత్తిరీత్యా మోడల్ అయిన ఆమె, తన భర్త “6-0” జెస్టర్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుని, “మ్యాచ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం” అని రాసింది.

అయితే ఆ స్టోరీ వైరల్ కావడంతో త్వరగానే తొలగించబడింది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు 24 గంటలు కనిపిస్తాయి. కానీ, ఈ స్టోరీ అంతకంటే ముందే కనిపించకుండా పోయింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana