DET:SEP23:
జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన సంఘటనపై అధికారిక ప్రకటన:
టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హైదరాబాద్‌లో యాడ్ షూటింగ్ చేస్తున్నప్పుడు తేలికపాటి గాయాన్ని పొందారు. ఈ విషయాన్ని ఆయన బృందం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

అధికారిక ప్రకటనలో ఏముంది?
ఎన్టీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆయనకు ఒక యాడ్ షూటింగ్ సమయంలో స్వల్ప గాయం అయ్యింది. వైద్యుల సలహా మేరకు ఆయన రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలు, అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని అభిమానులను, మీడియాను కోరారు.

సినిమాల షూటింగ్పై ప్రభావం:
ఈ గాయం వళ్ళ ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొనాల్సిన అన్ని షూటింగ్ లు, ఇతర పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న “డ్రాగన్” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రమాదం వళ్ళ ఆ సినిమా షూటింగ్ ప్రణాళికలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అభిమానుల ఆందోళన:
ఈ వార్త వెలువడిన వెంటనే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆయన బృందం ఈ గాయాలు తేలికపాటి మాత్రమేనని, ఆయన త్వరగా కోలుకుంటారని ధృవీకరించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana