DET:SEP23:
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు: ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు?
ప్రతిష్ఠాత్మక 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం సెప్టెంబర్ 23, 2025 ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న వారికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందజేయబడతాయి.

అవార్డుల వివరాలు:
ఈ ఏడాది అవార్డుల్లో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సేలకు సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. షారుఖ్ ‘జవాన్’ చిత్రానికి, విక్రాంత్ మాస్సే ’12త్ ఫెయిల్’ చిత్రానికి ఈ అవార్డును అందుకుంటున్నారు. ఇక ఉత్తమ నటిగా ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రానికి రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. అలాగే ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్కు ప్రకటించారు.

తెలుగు సినిమాకు అవార్డులు:
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా కూడా సత్తా చాటింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. హనుమాన్ చిత్రానికి రెండు అవార్డులు దక్కగా, ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది. ‘బేబీ’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్ నీలం అవార్డు గెలుచుకున్నారు.

ఎక్కడ చూడవచ్చంటే?
ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారు డీడీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. సెప్టెంబర్ 23, 2025న సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం లైవ్లో ప్రసారం అవుతుంది. రెడ్ కార్పెట్ ఈవెంట్తో పాటు అవార్డుల ప్రదానోత్సవాన్ని కూడా డీడీ న్యూస్ ద్వారా వీక్షించవచ్చు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana