
DNews: May 04: కరీంనగర్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో విపరీతమైన పరిస్థితులు నెలకొన్నాయని, బంగ్లాదేశ్ చొరబాటుదారుల మార్గాలు మూసివేయబడ్డాయని అన్నారు. దేశమంతా భారతీయ జనతా పార్టీని కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కలలు కంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్కు ఓటమి తప్పదని, కేరళలో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కొంతవరకు కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వచ్చినా, పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం బీజేపీని కోరుకున్నారని అన్నారు. రాహుల్ గాంధీ నిజానికి బీజేపీకి ప్రచారకర్తగా మారారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
