D Spiritual: Apr 22: చార్ ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావించే కేదార్‌నాథ్ ఆలయం ద్వారాలు శీతాకాల విరామం అనంతరం భక్తుల దర్శనార్థం మళ్లీ తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో కొలువైన ఈ పవిత్రక్షేత్రంలో మరోసారి ఆధ్యాత్మిక కోలాహలం ప్రారంభమైంది.

ఆలయ పునఃప్రారంభాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, డప్పు వాయిద్యాల నడుమ ఆలయ తలుపులు తెరవగా, ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

హిమాలయాల్లో గడ్డకట్టే చలి ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి నిలబడ్డారు. “హరహర మహాదేవ శంభో” నినాదాలతో కేదార్ లోయ అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana