
DNews: Mar17:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. PMAY గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించనున్న ఇళ్ల యూనిట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.39 లక్షలుగా ఖరారు చేసింది. మొత్తం యూనిట్ ధర: రూ.2.39 లక్షలు,
కేంద్రం భరించాల్సిన మొత్తం: రూ.95,400,రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన మొత్తం: రూ.63,600
దీంతో పాటు, స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులకు 3 శాతం వడ్డీ సబ్సిడీతో రూ.80,000 అందించబడతాయి. జి రామ్ జీ కన్వర్జెన్స్ కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.27,000 కేటాయించబడతాయి. ఎస్‌బిపిఎం (గ్రామీణ్)-ఐహెచ్‌హెచ్‌ఎల్ కింద ప్రతి లబ్ధిదారునికి రూ.12,000. ఈ పథకంలో తదుపరి చర్యలను పరిశీలించి, అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ ఎండిని ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
