'Divyang Shakti': Free bus travel for the disabled-DTv Telangana

DNews: Mar17: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘దివ్యాంగ్ శక్తి’ పథకం కింద బుధవారం నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని గుంటూరు బస్ స్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు 50 శాతం ఛార్జీతో ప్రయాణించేందుకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు దివ్యాంగులకు జీరో ఫేర్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. నాన్-స్టాప్, అంతర్రాష్ట్ర, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు యథావిధిగా 50 శాతం రాయితీతో ప్రయాణించే సౌకర్యం కొనసాగుతుంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana