
DET:MAR 17:
అనుమతి తీసుకుని మరీ..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హసన్ జహంగీర్ మాట్లాడుతూ తన పాటను వాడుకోవడానికి ధురందర్ చిత్ర బృందం ముందుగానే అధికారికంగా అనుమతి తీసుకుందని చెప్పారు.ఒక సినిమా 300 కోట్లతో నిర్మితమై 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ చిత్ర బృందం నాకు 50,000 డాలర్లు పంపారు అని ఆయన స్పష్టం చేశారు.
సంజయ్ దత్ ఎంట్రీ సీన్ హైలైట్:
ధురందర్ సినిమాలో సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ హవా హవా రీమిక్స్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది.ఆ సీన్ థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.ముఖ్యంగా ఈ తరం Gen Z ప్రేక్షకులకు ఈ పాట మళ్ళీ బాగా దగ్గరయ్యింది.
మారిన కాపీరైట్ రూల్స్:
గతంలో కాపీరైట్ నిబంధనలు అంత కఠినంగా ఉండేవి కావని కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని హసన్ జహంగీర్ పేర్కొన్నారు.
40 ఏళ్ల క్రితం పాట ఈ పాటను ఆయన 1986లో రికార్డ్ చేసి 1987లో విడుదల చేశారు.తన పాత పాటలకు ఇప్పటికీ ఇంత గుర్తింపు మరియు రెమ్యూనరేషన్ దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా గురించి ఒక చిన్న అప్‌డేట్:
ఈ చిత్రానికి సీక్వెల్ ధురందర్ ది రివెంజ్ కూడా మార్చి 19,2026న విడుదల కాబోతోంది.దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.
