DET:MAR 16:
అర్జిత్ సింగ్ నిర్ణయం:
గత దశాబ్ద కాలంగా బాలీవుడ్‌ను తన గొంతుతో ఏలుతున్న అర్జిత్ సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుస రికార్డింగ్‌లు లైవ్ కాన్సర్ట్‌ల వల్ల తాను మానసికంగా,శారీరకంగా అలసిపోయానని,కొన్నాళ్ల పాటు ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని వెల్లడించారు.

శ్రేయా ఘోషాల్ మద్దతు:
అర్జిత్ సింగ్ వ్యాఖ్యలపై శ్రేయా ఘోషాల్ స్పందిస్తూ.. ఒక ఆర్టిస్టుగా ఆయన భావాలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.
నిరంతరం స్టూడియోలు, ట్రావెలింగ్, పర్ఫార్మెన్స్‌లతో గడపడం వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది.అరిజిత్ పడుతున్న ఒత్తిడి నాకు తెలుసు అని ఆమె పేర్కొన్నారు.

నాక్కూడా అనిపిస్తోంది:

నిజం చెప్పాలంటే అర్జిత్ సింగ్ అన్నట్లుగా నాకు కూడా అప్పుడప్పుడు అన్ని వదిలేసి కొన్నాళ్ల పాటు సుదీర్ఘ విరామం తీసుకోవాలని అనిపిస్తోంది.మళ్ళీ కొత్త ఉత్సాహంతో రావాలంటే ఆ గ్యాప్ అవసరం అని ఆమె మనసులో మాట బయటపెట్టారు.

ఆందోళనలో ఫ్యాన్స్:
ఇద్దరు అగ్రశ్రేణి గాయకులు ఒకేసారి బ్రేక్ గురించి మాట్లాడటంతో మ్యూజిక్ లవర్స్ కంగారు పడుతున్నారు.వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే డ్యూయెట్స్ ఇక వినలేమా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.అయితే ఇది శాశ్వత విరమణ కాదని కేవలం రీఛార్జ్ అవ్వడానికి తీసుకునే చిన్న విరామం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana