
DET:MAR 16:
వైరముత్తుపై విమర్శలు:
వైరముత్తుపై గతంలో చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవల ఒక సందర్భంలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ ఆయనను ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టడంపై చిన్మయి అసహనం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉండాల్సిన పెద్దలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గౌరవించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
నేను కూడా వారి అభిమానినే:
ఈ విమర్శల వల్ల చిన్మయిపై సోషల్ మీడియాలో భారీగా నెగటివిటీ వచ్చింది.దీనిపై స్పందిస్తూ ఆమె ఇలా పేర్కొన్నారు
అభిమానం వేరు,విలువలు వేరు, నేను కూడా ఒకప్పుడు రజనీ సర్,కమల్ సర్ సినిమాలను చూస్తూ పెరిగిన అభిమానినే.కానీ అభిమానం అనేది వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించకుండా ఉండదు.
బాధ కలిగించింది:
నేను గౌరవించే వ్యక్తులే ఇలాంటి వైఖరి అవలంబించడం నన్ను ఎంతగానో బాధించింది.నాపై ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతమంది తిట్టినా సరే.. నిజం వైపే నిలబడతాను.పరిశ్రమలోని పెద్ద తలకాయలు తన పోరాటాన్ని గుర్తించకపోగా, ఆరోపణలు ఉన్న వ్యక్తికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలో స్పందన:
చిన్మయి వ్యాఖ్యలపై అటు కమల్ హాసన్ ఫ్యాన్స్,ఇటు రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటిస్తున్నారు.అయితే ఆమెకు మద్దతుగా కూడా కొంతమంది మహిళా సంఘాలు నిలబడుతున్నాయి.
